కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించకుండా పరికరాలు కొన్నట్లు గుర్తించారు. ట్రిపుల్‌ఐటీలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చిన అధికారులు... నిబంధనలు పాటించకుండా ఒప్పంద ఉద్యోగులను నియమించినట్లు గుర్తించారు. వసతిగృహంలోని 3 మెస్‌లలో ఆహార పంపిణీలో నాణ్యత లోపం, సమీపంలో మురుగునీరు ప్రవహించడంపై సిబ్బందిని ప్రశ్నించారు. ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లు సహా... మరికొన్ని విషయాలపై విచారణ కొనసాగిస్తున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. గతంలో పనిచేసిన ఉద్యోగుల ప్రమేయంపైనా అధికారుల ఆరా తీశారు.
ఇవీ చూడండి-పర్యటక ప్రాంతాల్లో నక్షత్ర హోటళ్లు, రిసార్టులు..!