ETV Bharat / state

రైతులకు తెలియకుండానే .. కౌలుకు పొలాలు - farmers

రైతులకు తెలియకుండానే వారి పొలాలను కౌలుకిచ్చినట్టు పత్రాలు సృష్టించి ధాన్యం సేకరణకు వినియోగించిన  గోల్​మాల్​ వ్యవహారాన్ని విజిలెన్స్ ఆండ్ ఎన్ఫోర్స్​మెంట్ విభాగం అధికారులు గుర్తించారు.

విజిలెన్స్ అధికారులు
author img

By

Published : May 22, 2019, 7:05 AM IST

రైతులకు తెలియకుండానే .. కౌలుకు పొలాలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అన్నవరంలో ధాన్యం సేకరణలో గోల్ మాల్ ను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఎస్పీ లావణ్య లక్ష్మి ఆధ్వర్యంలో డీఎస్పీ విజయపాల్, సీఐ అపర్ణ, ఏజీ బాలాజీ నాయక్ బృందం విచారణ చేపట్టారు. జగ్గయ్యపేటకు చెందిన భాస్కర్ రైస్ ఇండస్ట్రీస్ ద్వారా జరిగిన ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. గుమ్మడుదుర్రు, అన్నవరం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో 225 ఎకరాలకు సంబంధించి దొంగ పత్రాలతో కొనుగోళ్లు జరిగినట్టు నిర్ధరించారు. తెలంగాణకు చెందిన వ్యక్తులను కౌలురైతులుగా చూపి.. ఆయా గ్రామాల్లో పొలాలను కౌలుకు తీసుకున్నట్టు పత్రాల్లో తెలిపారు. సర్వే నెంబర్లలోని రైతులు అసలు తమ పొలాలను కౌలుకు ఇవ్వలేదని వాంగ్మూలం ఇచ్చారు. వీఆర్వో బేబీ నుంచి వివరణ తీసుకోగా పత్రాలు తాను ధ్రువీకరించినవి కావని తెలిపారు. ఈ విషయాలపై పోలీస్ కేసు నమోదు చేశామని.. రెవిన్యూ శాఖకు కూడా ఫిర్యాదు చేశామని...నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నట్టు ఎస్పీ లావణ్య తెలిపారు.

ఇది కూడా చదవండి.

ఎగ్జిట్​పోల్స్​ ఓ ఆర్థిక కుంభకోణం: తులసిరెడ్డి

Hyderabad, May 21 (ANI): Due to the rising temperature in Hyderabad, the heatstrokes cases have seen a drastic increase. According to Dr. K. Shankar, Superintendent, Fever Hospital, at least 8 to 10 cases have been arising daily from last 15 days. While speaking to ANI, K. Shankar said, "Due to rising temperatures, we are receiving 2 to 3 heat stroke cases daily. While some other government hospitals are receiving up to 10 cases. We have appointed a special team to treat these cases immediately." Shankar also advised people to drink lots of water, buttermilk and coconut water and has advised them to avoid coming out during the afternoon.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.