ETV Bharat / state

స్నేహితుడికి ఉపరాష్ట్రపతి ఫోన్....ఆరోగ్యం పై ఆరా! - విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి వెచ్చా ఉమామహేశ్వర గుప్తా

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన మిత్రుడైనా నందిగామ కేవీఆర్‌ కళాశాల విశ్రాంత సూపరింటెండెంట్‌ వెచ్చా ఉమామహేశ్వర గుప్తాకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

Vice President venkaihnaidu phone to a friend
స్నేహితుడికి ఉపరాష్ట్రపతి ఫోన్
author img

By

Published : May 2, 2020, 8:54 AM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన మిత్రుడికి ఫోన్‌ చేసి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా నందిగామ కేవీఆర్‌ కళాశాల విశ్రాంత సూపరింటెండెంట్‌, విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి వెచ్చా ఉమామహేశ్వర గుప్తాకు శుక్రవారం ఉదయం ఉపరాష్ట్రపతి ఫోన్‌ చేశారు. ఆరోగ్యం ఎలా ఉందని, మిత్రులంతా ఎక్కడెక్కడ ఉన్నారని అడిగారని గుప్తా తెలిపారు. మిత్రుల ద్వారా తన ఫోన్‌ నంబరు తీసుకుని మరీ వెంకయ్యనాయుడు ఫోన్‌ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ‘జై ఆంధ్ర’ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన వెంకయ్యనాయుడు.. ఆ సమయంలో నందిగామకు తరచూ వస్తుండేవారని, అప్పటి నుంచి తమకు పరిచయం ఉందన్నారు.

ఇవీ చదవండి...గొంతు తడిసే దారేది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.