Vice President Venkaiah Naidu AP Tour: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. చెన్నై నుంచి ప్రత్యేక రైలులో వచ్చిన ఉపరాష్ట్రపతికి.. కృష్ణా జిల్లా గన్నవరం రైల్వే స్టేషన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలికారు. గవర్నర్ వెంట మంత్రి వెల్లంపల్లి, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ గౌతం సవాంగ్ ఉన్నారు.
అనంతరం గన్నవరం నుంచి స్వర్ణభారత్ ట్రస్టుకు వెంకయ్యనాయుడు బయలుదేరి వెళ్లారు. స్వర్ణభారత్ ట్రస్టులో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఉపరాష్ట్రపతి మంగళవారం(రేపు) ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి విశాఖకు వెళ్లనున్నారు.
ఇదీ చదవండి