వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. గత ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. రూ. 285 కోట్లు కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉండగా బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.1000కోట్లు ఇస్తామన్న జగన్, అధికారంలోకి వచ్చాక రూ. 100కోట్లు ఇచ్చి.. వాటిలో రూ. 55కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు.
నాలుగు నెలల నుంచి బ్రాహ్మణ వర్గంలోని వృద్ధులకు పింఛన్లు అందడంలేదని వేమూరి ఆనంద్ వాపోయారు. సీఎం జగన్ వివిధ వర్గాల కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అమ్మఒడి వంటి పథకాల కింద ఇచ్చే మొత్తాన్నీ.. ఆయా వర్గాల కార్పొరేషన్ నిధుల్లో చూపడం ఏమిటని ఆయన నిలదీశారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరు: 2021 నాటికైనా వ్యాక్సిన్ వచ్చేనా?