రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు షరతులతో ఉపకులపతులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ వర్సిటీకి తుమ్మల ప్రొఫెసర్ తుమ్మల రామకృష్ణ, శ్రీ వేంకటేశ్వర వర్సిటీకి రిటైర్డ్ ప్రొఫెసర్ కె.రాజా రెడ్డి, కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ ఎ.ఆనందరావు, అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి ప్రొఫెసర్ ఎం.రామకృష్ణా రెడ్డిలను ఉప కులపతులుగా నియమించింది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి నియామకానికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. విశ్వవిద్యాలయాల చట్ట సవరణపై న్యాయస్థానంలో పిల్ ఉన్నందున గవర్నర్ కార్యాలయం వీసీల నియామక దస్త్రాన్ని పక్కన పెట్టింది. దీనిపై ఉన్నత విద్యాశాఖ తరఫున అధికారులు వివరణ ఇచ్చారు. కోర్టు తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని నోటిఫికేషన్లోనూ పేర్కొన్నారు.
ఇదీ చదవండి