సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు తెలుగుదేశం నేత వర్ల రామయ్య లేఖ రాశారు. విచారణ పూర్తయ్యే వరకు సునీల్ కుమార్‌ను అప్రధాన పోస్టులో ఉంచాలని విఙ్ఞప్తి చేశారు. సునీల్ సీఐడీ చీఫ్‌గా ఉంటే విచారణాధికారిపై ప్రభావం పడుతుందని అన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన సునీల్ కుమార్ వివిధ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఇదే విషయంపై డీజీపీ గవర్నర్ , కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేసినట్లు వర్ల రామయ్య తెలిపారు .
ఇదీ చూడండి. curfew: కర్ఫ్యూ సడలింపుపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారా?