రాజధాని రైతులకు తెదేపా నేత వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. రాజధాని గ్రామాలైన మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైతులు 33 వేల ఎకరాలను రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చారని, వారి త్యాగాలను వైకాపా నేతలు అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపిన జగన్ ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. రైతుల ఉద్యమంలో నిజాయితీ ఉంది కాబట్టే అందరూ మద్దతు పలుకుతున్నారన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం కూడా స్పందించి.. అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేయాలని రాధా డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి