ETV Bharat / state

'ఆ బిల్లులు గవర్నర్‌ ఆమోదించడం రాజ్యాంగ వ్యతిరేకం'

అమరావతిలో రాజధాని కొనసాగింపు 5 కోట్ల ఆంధ్రప్రజలకు చెందిన అంశమని... తరలింపు ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వంపై నమ్మకం సడలి అభివృద్ధి కుంటుపడుతుందని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. తాతముత్తాతల నుంచి సంక్రమించి... ప్రాణప్రదంగా చూసుకునే భూములను రాజధానికి అందజేసిన రైతులను... 3 రాజధానుల నిర్ణయం తీవ్రమైన మనోవేదనకు గురిచేసిందన్నారు.

vadde sobhanadreeswara rao Interview On 3 capitals decisions
వడ్డే శోభనాద్రీశ్వరరావు
author img

By

Published : Aug 14, 2020, 3:25 PM IST

వడ్డే శోభనాద్రీశ్వరరావుతో ముఖాముఖి

ప్రభుత్వ నిర్ణయం జీవన్మరణ సమస్యగా మారి... తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందనే ఆవేదనతోనే 68 మంది రైతులు, రైతు కూలీలు మానసిక సంఘర్షణతో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. 3 రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై గవర్నర్‌ ఆమోదముద్ర వేయడం రాజ్యాంగ వ్యతిరేకమని... ఈ చట్టాలు చెల్లుబాటు కావనే తీర్పు న్యాయస్థానాల నుంచి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజధానులు, రైతుల ఆందోళనల నేపథ్యంలో 'పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డాం' పేరిట ఓ పుస్తకం ప్రచురించారు. ఈ సందర్భంగా 'ఈటీవీభారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఇదీ చదవండీ... మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.