ETV Bharat / state

Balloon Satellite: విద్యార్థుల టాలెంట్​.. అధ్యాపకుల సపోర్ట్​.. బెలూన్ శాటిలైట్ రూపకల్పన

Balloon Satellite: విద్యార్థుల్లోని సృజనాత్మకతకు అధ్యాపకుల ప్రొత్సాహం ఉంటే అద్భుతాలు సాధించగలరని కృష్ణా జిల్లా తేలప్రోలులోని ఉషారామా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు నిరూపించారు. కళాశాలలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్ధులు రుపొందించి, ప్రయోగించిన బెలూన్ శాటిలైట్ విజయవంతమైంది. ఈ బెలూన్ శాటిలైట్ వల్ల వాతావరణంలో జరుగుతున్న మార్పులను తెలుసుకోవచ్చని విద్యార్ధులు చెబుతున్నారు.

balloon satellite
బెలూన్ శాటిలైట్
author img

By

Published : Jun 29, 2023, 10:01 PM IST

సృజనాత్మకతకు పదును పెట్టిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు.. బెలూన్ శాటిలైట్ రూపకల్పన

Engineering College Students Launch Balloon Satellite: కృష్ణా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలోని ఉషారామా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు చేసిన హై అల్టిట్యూడ్ బెలూన్ శాటిలైట్ శాస్త్రవేత్తలను కూడా అబ్బురపరుస్తోంది. చెన్నైకు చెందిన స్పేస్ కిడ్స్ ఇండియా సహకారంతో ఉషారామా శాట్ ప్రాజెక్టు డైరెక్టర్ సుంకర అక్షయ్ నేతృత్వంలో ఎన్ఏఎస్ఎల్వీ-19 హై ఆల్టిట్యూడ్ బెలూన్ శాట్​ను విద్యార్ధులు రుపొందించారు.

విద్యార్డులు సంయుక్తంగా రూపొందింన ఈ శాటిలైట్​ను కళాశాల ఆవరణలో నింగిలోకి విడుదల చేశారు. స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు బెలూన్ శాటిలైట్ నిర్మాణంపై కళాశాలలోని మెకానికల్, సివిల్, ఐటీ, సీఎస్సీ, ఈసీఈ విద్యార్ధులకు వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శాటిలైట్​ను రుపొందించడంలో ఆయా విభాగాలకు సంబంధం ఉండే బాధ్యతలను అప్పగించారు.

స్పేస్ ఇండియా కిడ్స్ సహకారంలో ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ బెలూన్ శాటిలైట్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్ధులు చెబుతున్నారు. గాలిలోకి శాటిలైట్ వెళ్లిన తర్వాత ట్రాకింగ్ కోసం టెలీమెట్రీ, పేలోడ్ క్యాప్సూల్లో కళాశాల ఆవరణలో ఓ గ్రౌండ్ స్టేషన్​ను విద్యార్ధులు రూపొందించారు.

ఎగువ వాతావరణ, పరిశోధన, రేడియో కమ్యూనికేషన్ ప్రయోగాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఫొటోలు, సమాచార రూపంలో ఈ శాటిలైట్ కిందకి చేరవేసేలా తయారు చేయడం జరిగిందని విద్యార్ధులు తెలిపారు. హీలియం గ్యాస్ నింపిన బెలూన్ సుమారు మూడు గంటల పాటు 25 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించగలదని విద్యార్ధులు చెప్పారు. బెలూన్​లో ముందుగానే జీపీఎస్ ట్రాకర్స్​ను అమర్చి బెలూన్ ఎటువైపు పయనిస్తుందో తెలసుకోవచ్చని అన్నారు.

అమరావతి రాజధాని ప్రాంతంలోని నెక్కల్లు గ్రామంలో బెలూన్ శాటిలైట్ దిగినట్లు తెలిపారు. శాటిలైట్ భూమిపైకి వచ్చేంత వరకూ ప్రత్యేక ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు. సైన్స్​పై ఉన్న మక్కువ, సమాజానికి ఎదైనా మంచి చేయాలనే తపనతోనే తాము ఈ కార్యక్రమం చేపట్టామని అంటున్నారు. బెలూన్ శాట్ పైకి వెళ్లిన తర్వాత.. శాటిలైట్ పరిస్థితులను తెలుసుకునేందుకు యాంటినాను ఏర్పాటు చేశామని విద్యార్థులు తెలిపారు.

బెలూన్ శాటిలైట్​కు అనుసంధానంగా పెలోడ్ బాక్స్​ను పెట్టామని విద్యార్ధులు తెలిపారు. పెలోడ్ బాక్స్​కు అనుసంధానంగా పారాచూట్​ను ఏర్పాటు చేశామని బెలూన్ పగిలిన తర్వాత పారాచూట్ ఓపెన్ అవుతుందని దాని ద్వారా పెలోడ్ బాక్స్ కిందకి వస్తుందని వివరించారు. ఈ పెలోడ్ బాక్స్​లో వివిధ రకాల సెన్సార్​లను ఏర్పాటు చేశామని పెర్కొన్నారు. టెంపరేచర్, గ్యాస్, యూవీ, హీట్ వంటి సెన్సార్​ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుకునే అవకాశం ఉందన్నారు.

సంతోషం వ్యక్తం చేసిన ప్రన్సిపల్: ఈ బెలూన్ శాటిలైట్​ను రుపొందించడం వల్ల విద్యార్ధులకు సాంకేతికపై అవగాహన ఏర్పాడుతుందని కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. స్పెస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులు దాదాపు వారం రోజులు పాటు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని చెప్పారు. బెలూన్ శాటిలైట్ తమ కళాశాల నుంచి విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని ఆవిష్కరణలకు.. స్ఫూర్తిగా: తమ కళాశాల ఆధ్వర్యంలో బెలూన్ శాటిలైట్​ను ప్రయోగించడం గర్వంగా ఉందని కళాశాల కరస్పాండెంట్ అనిల్ సుంకర తెలిపారు. స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ సహకారంతో తమ విద్యార్ధులు ఈ అరుదైన ఘనతను సాధించారని చెప్పారు. రానున్న రోజుల్లో తమ కళాశాల తరుపున మరిన్ని అవిష్కరణలు చేసేందుకు ఈ బెలూన్ శాటిలైట్ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

శుభపరిణామం.. డీఆర్​డీఓ శాస్త్రవేత్త: ఆంధ్రప్రదేశ్​లో మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సొంత ఆలోచనలను తుది రూపం ఇచ్చి బెలూన్ శాటిలైట్​ను తయారు చేసి ప్రయోగించడం శుభ పరిణామమని డీఆర్​డీఓ శాస్త్రవేత్త డాక్టర్ పి అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వారి కొత్త ఆలోచనలు పదును పెట్టి సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలను రూపొందించాలని ఆకాంక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.