ETV Bharat / state

ఎంతటి ఘోరం.. తప్పు కారు డ్రైవర్​ది.. ప్రాణం పోయింది బైక్​ పై ఉన్నవాళ్లది! - పామర్రు మండలంలో రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లాలో(krishna district) ఘోర రోడ్డు(accident) ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ దాటి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

accident
accident
author img

By

Published : Nov 4, 2021, 7:22 PM IST

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(accident) సంభవించింది. కృష్ణా జిల్లా (krishna district)పామర్రు మండలం కాపవరం వద్ద.. అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ వేగానికి పల్టీలు కొడుతూ.. డివైడర్ దాటి అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు మొవ్వ మండలం కాజాకు చెందిన కామేశ్వరరెడ్డి(24), మోదుగుమూడి ఉమాకాంత్​(20)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

DEAD: ట్రాక్టర్ కిందపడి యువ రైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.