వేర్వేరు జిల్లాల్లో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తలు మృతి చెందారు.
గుంటూరు జిల్లా...
పంట పొలంలో తెగిన విద్యుత్ తీగకు మరమ్మతు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామంలో జరిగింది. భార్గవ చారి పొలంలో విద్యుత్ మోటారు వేసేందుకు వెళ్లగా... అదే సమయంలో విద్యుత్ వైరు తెగి ఉండటం గమనించాడు. వైరును సరి చేసేందుకు విద్యుత్ స్తంభం పైకి ఎక్కగా విద్యుదాఘాతానికి గురై... స్తంభంపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా పామర్రు మండలం జుఝువరంలో పొలంలో బోరు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కంకిపాడు మండలం నెప్పల్లికి చెందిన అప్పికట్ల రవిగా గుర్తించారు.
ఇదీ చదవండి