కృష్ణా జిల్లాలో వైకాపాకి నుంచి 25 కుటుంబాలు.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన తెదేపాలో చేరారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ పాలన సాగుతోందని సౌమ్య విమర్శించారు. ఈ ప్రభుత్వం సంక్షేమము, అభివృద్ధి మానేసి.. కేసులు పెట్టడం ఒక్కటే చేస్తోందని మండిపడ్డారు. 'న్యాయం గెలిచింది మనం సిద్ధంగా ఉండాలి. ఈ ఎలక్షన్లలో ప్రతి చోట తెదేపా జెండా ఎగురవేయాలి' అని శ్రేణులకు సూచించారు.
నిత్యావసరాలు మొత్తం కొండెక్కిపోయాయి.. పెట్రోల్ , కరెంటు బిల్లులు పెరిగిపోయాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ భారం మొత్తం ప్రజల మీద మోపుతోందని విమర్శించారు. అందరూ కలిసికట్టుగా పని చేసి స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని తెలిపారు.
ఇదీ చదవండీ.. నాడు ఉత్తమ రైతు.. నేడు చేపలమ్ముతూ