BAIL GRANTED TO THREE ACCUSED IN MLAs BUYING CASE : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు బెయిల్ మంజూరు అయింది. ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. మూడు లక్షల రూపాయల సొంత పూచి కత్తుతోపాటు రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి సోమవారం సిట్ అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని.. పాస్‌పోర్టులను దర్యాప్తు అధికారి వద్ద డిపాజిట్ చేయాలని న్యాయస్థానం షరతు విధించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి.
నిందితులు నెలరోజులపాటు జైల్లో ఉన్నారని సుప్రీంకోర్టు సైతం బెయిలు ఇవ్వొచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 41ఏ నోటీసు ఇవ్వకుండా నిందితులను అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పు పట్టినట్లు ఆయన వాదించారు. నిందితులకు బెయిలు ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేయడంతో పాటు.. సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్ దర్యాప్తు కీలక దశలో ఉందని ఈ సమయంలో బెయిలు మంజూరు చేయొద్దని న్యాయస్థానాన్ని కోరారు. హైకోర్టు నిందితుల తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేసింది.
నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. దక్కన్ కిచెన్ లీజ్ విషయంలో.. బెదిరింపులు విషయంలో వేరువేరుగా 5 కేసులు నమోదు చేశారు. లీజ్ విషయంలో పోలీసులు నందకుమార్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ మంజూరు అయితే జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. రామచంద్ర భారతి పైనా బంజారాహిల్స్ పీఎస్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. నకిలీ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగు లైసెన్స్ కలిగి ఉన్నారని రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. రామచంద్ర భారతి బెయిల్‌పై బయటకు రాగానే బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: