ETV Bharat / state

మూడు ప్రధాన ఆలయాలకు ట్రస్టు బోర్డులు నియామకం - simhachalam temple news

రాష్ట్రంలోని మూడు ప్రధాన ఆలయాలకు ప్రభుత్వం పాలకమండళ్లను నియమించింది. ఒక్కో ఆలయానికి 16 మంది సభ్యులతో పాలకమండలిని ఏర్పాటు చేశారు.

trust boards appointed for 3 main temples in ap
trust boards appointed for 3 main temples in ap
author img

By

Published : Feb 20, 2020, 10:26 PM IST

రాష్ట్రంలో 3 ప్రధాన ఆలయాలకు పాలకమండళ్ల (ట్రస్టు బోర్డు)లను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, ద్వారకా తిరుమల, సింహాచలం ఆలయాలకు పాలకమండళ్లు నియమించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి 16 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు చేశారు. ఆలయ ఛైర్మన్ నియామకాన్ని పెండింగ్​లో పెట్టారు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 16 సభ్యులతో, సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వార్ల దేవస్థానానికి 16 మంది సభ్యులతో పాలక మండళ్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు ఆలయాలకు ఛైర్మన్లను నియమించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త... పాలక మండలి ఛైర్మన్​గా వ్యవహరిస్తారని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.