విజయవాడ రైల్వేస్టేషన్లో... ప్రయాణికుల సంక్షేమ సలహా మండలి ఆకస్మిక తనిఖీలు చేసింది. జాతీయ సభ్యులు వెంకట రమణి నేతృత్వంలోని ఐదుగురు తనిఖీలు చేశారు. క్యాంటీన్లు, దుకాణాల అనుమతులు, ఆహార పదార్థాల నాణ్యత, ధరలపై ఆరా తీశారు. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలో పరిశుభ్రతను పరిశీలించారు. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు... మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, వాటిని బాగు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి