కృష్ణా జిల్లా పామర్రు పోలీస్‌స్టేషన్ ఎదుట వృద్ధ దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పామర్రు గాంధీనగర్‌కు చెందిన చిలంకుర్తి గోపాలకృష్ణ, దుర్గ దంపతులకు చెందిన స్థలం విషయంలో వివాదం నెలకొంది. ఈ స్థలానికి సంబంధించి తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని దంపతులు చెబుతున్నారు. అయితే... సుమారు 25 మంది వచ్చి మంగళవారం కళ్లలో కారంకొట్టి దాడి చేశారని వృద్ధ దంపతులు వాపోయారు. తాము పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఈ విషయం ఫిర్యాదు చేయగా ఈ కేసు సివిల్ అంశమని, తహసీల్దార్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. మనస్థాపానికి గురైన ఆ దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్యహత్యకు యత్నించారు.
ఇదీ చదవండీ... నామినేషన్లు వేయని 12 పంచాయతీలు, 725 వార్డుల్లో మళ్లీ ఎన్నికలు