విజయవాడలో సాంస్కృతిక నృత్య ప్రదర్శన - traditional dace fest in Vijayawada Krishna dst
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డ్యాన్స్ ఫెస్ట్ నిర్వహించారు. శ్రీ కిరణ్మయూరి కళాక్షేత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో కూచిపూడి నృత్యరూపకాన్ని సీతాప్రసాద్ లక్ష్మీ గ్రూప్ సభ్యులు ప్రదర్శించారు. సాంస్కృతిక నృత్యాలను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. అర్థనారీశ్వరం, సావేరి రాగాల నృత్యోత్సవం ప్రేక్షకులను అలరించింది.