ETV Bharat / state

విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గుర్ని బలి తీసుకున్న మహమ్మరి - కృష్ణాజిల్లా నేర వార్తలు

కరోనా మహమ్మారి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఒకే కుటుంబంలో నెలరోజుల వ్యవధిలో ముగ్గుర్ని వైరస్ బలిగొన్న ఘటన కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో నెలకొంది. మొదట వృద్ధులైన తల్లిదండ్రులు, తర్వాత వారి కుమారుడు మృతి చెందడంతో తమకు దిక్కెవరు అంటూ భార్య, ఇద్దరు కుమార్తెలు బోరున విలపిస్తున్నారు.

విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురిన బలి తీసుకున్న మహమ్మరి

author img

By

Published : Jun 8, 2021, 10:15 PM IST

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన ఎడ్ల వెంకటేశ్వర్లు( 65), నీలమ్మ (60 )దంపతులు. వారికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ఎడ్ల నాగరాజు (40) అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారంతా కలిసి ఓకే ఇంట్లో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొవిడ్ లక్షణాలతో మే 14న నీలమ్మ ఇంటి వద్దే మృతి చెందారు. భర్త వెంకటేశ్వర్లుకు సైతం లక్షణాలు కనిపించడంతో చికిత్సకోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలోనే పెద్ద కుమారుడు నాగరాజుకు, మూడో కోడలికి వైరస్ సోకడంతో నాగరాజును ఖమ్మం, కోడలిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

మొదట ఆస్పత్రికి వెళ్లిన వెంకటేశ్వర్లు కొద్దిరోజుల్లోనే కోలుకొని ఇంటికి చేరారు. అప్పటికే భార్య చనిపోవడం.. మరోవైపు కుమారుడు, చిన్న కోడలు ఆస్పత్రి పాలు కావడంతో మనస్తాపానికి గురైన ఆయన మే 20న గుండెపోటుతో మృతి చెందారు. తండ్రి మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఉన్న కుమారునికి తెలియజేయలేదు. ఇంటి దగ్గర నుంచి కుటుంబ సభ్యులు ఫోన్లో మాట్లాడి ఆరోగ్య విషయాలు తెలుసుకుంటే.. నాన్న ఎందుకు మాట్లాడటం లేదని పలుమార్లు ఫోన్​లో కుటుంబ సభ్యులను నాగరాజు ప్రశ్నించేవారు.

ఖమ్మంలో చికిత్స పొందుతున్న నాగరాజు ఆరోగ్యం క్షీణించి మంగళవారం మృతి చెందారు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మృతదేహానికి కుమార్తె లతోనే అంతక్రియలు చేయించారు. ఆస్పత్రి ఖర్చులు కోసమే సుమారు 10 లక్షలు ఖర్చు చేసినట్లు బంధువులు చెబుతున్నారు. వ్యవసాయ పనులు చేసి కుటుంబాన్ని పోషించే నాగరాజు లేకపోవడంతో భార్య, కుమార్తెలు గుండెలవిసేలా విలపించారు. తమకు దిక్కెవరు అంటూ వారు చేస్తున్న రోదనలతో అక్కడికి వచ్చిన వారంతా కంటతడి పెట్టుకున్నారు.

ఇదీ చదవండి:

పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.