కృష్ణాజిల్లా పామర్రు గాంధీనగర్‌లో ఒకే కుటుంబానికి ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కేసులతో స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. గాంధీనగర్‌లో హైపో క్లోరైడ్ ద్రావాణాన్ని పిచ్చికారి చేసి, శానిటేషన్ చేపట్టారు. ఈ కుటుంబం వారు కర్నూలు జిల్లా చాగలమర్రిలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. ప్రైమరీ, సెండరీ కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తామని ఎండీవో మళ్లేశ్వరి వివరించారు.
ఇదీ చదవండి : ఈఎస్ఐ మందుల కుంభకోణంలో చంద్రబాబుకూ వాటా ఉంది: బొత్స