తిరుమల శ్రీనివాసుడిని సేవలో జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు . శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల విషయంలో తితిదే కొవిడ్ ప్రోటోకాల్‌ను అద్భుతంగా పాటిస్తోందని లెఫ్టినెంట్ గవర్నర్ కితాబిచ్చారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన... స్వామి వారి నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కి పండితులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనకు అందజేశారు.
కరోనా పరిస్థితుల నుంచి దేశం త్వరగా బయటపడాలని స్వామి వారిని వేడుకున్నట్లు మనోజ్ సిన్హా తెలిపారు. గతంలో కంటే మెరుగ్గా తితిదే ఏర్పాట్లు చేస్తోందన్న ఆయన.... భక్తులు ఎవరూ వైరస్ బారిన పడకుండా స్వామి వారి సేవలో పాల్గొంటారని ఆశిస్తున్నానని అన్నారు.
మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రొటెం స్పీకర్‌కి తీర్థప్రసాదాలు అందచేశారు. రేపు మధ్యాహ్నం శ్రీహరికోట నుంచి పీఎస్ ఎల్వీ సీ-49 రాకెట్ ను ప్రయోగిస్తున్న నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. రాకెట్ నమూనాను శ్రీవారి చెంత ఉంచి ఆశీర్వచనం తీసుకున్నారు.
ఇదీ చదవండీ...