కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన చల్లా రాజేశ్వరి అనే 70 ఏళ్ల మహిళ ఇంట్లో సుమారు కోటి విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
రాజేశ్వరి హైదరాబాద్లో తన సోదరుని ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత ఇంటి తలుపులు తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి చూడగా.. ఆభరణాలు మాయమైన విషయం తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభంచారు. జాగిలాలు, క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి:
ప్రతిపక్ష అభ్యర్థులకు భద్రత కల్పించండి: సీఈసీకి అచ్చెన్న లేఖ