ETV Bharat / state

కత్తితో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్​ - పెనమలూరు నేర వార్తలు

కృష్ణా జిల్లాలో మిని లారీ డ్రైవర్​పై కత్తితో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు అరెస్ట్​ చేశారు. జల్సాలకు అలవాటు పడిన వారు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

thieves arrest
కత్తితో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్​
author img

By

Published : Mar 25, 2021, 12:19 PM IST

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు బైపాస్ ప్రాంతంలో లారీ డ్రైవర్​పై కత్తితో దాడి చేసి నగదు దోపిడీ చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ రూరల్ రామవరప్పాడు పరిధిలో నివసించే బొల్లు శివరామకృష్ణ, పుప్పాల ప్రశాంత్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం, గంజాయికి అలవాటుపడి.. ఆ మత్తులో దోపిడీ చేసినట్లు సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపారు.

ఈ నెల 19వ తేదీన విజయవాడ భవానీపురం నుంచి ఉయ్యూరు వైపు చేపల లోడుతో వెళుతోన్న మినీ వ్యాన్​న అడ్డగించి డ్రైవర్ మహమ్మద్ ఇస్లాంపై కత్తితో దాడి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. దాడికి పాల్పడిన కత్తితో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: విజయవాడలో శానిటైజర్ తాగి ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.