ETV Bharat / state

21 రోజుల్లోనే అనుమతులు.. నూతన పారిశ్రామిక విధానం వెల్లడించిన మంత్రులు

Department of Industries road show in Mumbai : మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్ సమ్మిట్​పై ముంబైలో పరిశ్రమల శాఖ రోడ్ షో నిర్వహించింది. మంత్రులు బుగ్గన, జి.అమర్నాథ్, ఆదిమూలపు సురేష్ పరిశ్రమల శాఖ అధికారులు హాజరై.. కొత్త పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు వివరించారు.

గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్
గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్
author img

By

Published : Feb 20, 2023, 4:22 PM IST

Department of Industries road show in Mumbai : మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్ సమ్మిట్​పై ముంబైలో పరిశ్రమల శాఖ రోడ్ షో నిర్వహించింది. మంత్రులు బుగ్గన, జి.అమర్నాథ్, ఆదిమూలపు సురేష్ పరిశ్రమల శాఖ అధికారులు హాజరై.. కొత్త పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు భూ లభ్యత, వనరులు, 21 రోజుల్లోనే అనుమతులు తదితర అంశాలను ముంబైలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. కాస్మొపాలిటన్ నగరంగా విశాఖలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు వివరించారు. మరోవైపు వివాదాస్పద ప్రశ్నలు సమాధానాలు రాకుండా ప్రభుత్వం మంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే ప్రశ్నలు సమాధానాల కార్యక్రమం లైవ్ లింక్​ను తొలగించింది.

ఐటీ తరహాలో ఆహార శుద్ధి పరిశ్రమల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని అమలు చేయాలని ఏపీ నిర్ణయం తీసుకున్నట్టు ఆహార శుద్ధి పరిశ్రమల సొసైటీ సీఈఓ భరత్ తెలిపారు. ఏపీలో కొత్తగా 26 పరిశ్రమలకు ఈ తరహాలో ప్లగ్ అండ్ ప్లే విధానం అమలు చేయనున్నట్టు వెల్లడించారు. 15 ఏళ్లకు లీజు విధానంలో పరిశ్రమలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు ముంబైలో ఎంతో ప్రాచుర్యం పొందిన డబ్బావాలా విధానాన్ని ఒకరు చౌర్యం చేసి, టెక్నాలజీ జోడించి స్విగ్గీ సంస్థగా మార్చేశారన్నారు. ఈ విషయం ముంబై డబ్బావాలాలకు తెలియదని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పెట్టుబడులను ఏపీ ప్రభుత్వమే పెట్టేలా ఆహార శుద్ధి పరిశ్రమల్లో ప్లగ్ అండ్ ప్లే విధానం అమలు చేస్తాం. ఇందుకోసం రూ.3600 కోట్ల పెట్టుబడులు ప్రభుత్వం సమకూరుస్తుంది. పశ్చిమగోదావరిలో చాక్లెట్ పరిశ్రమ, మిల్లెట్ ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తాం. - భరత్, ఆహార శుద్ధి పరిశ్రమల సొసైటీ సీఈఓ

ఏపీ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించిందని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ రవీందర్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయంగా పోర్టులు ఇప్పుడు పారిశ్రామిక కాంప్లెక్సులుగా మారిపోతున్నాయని.. ఇదే ఆలోచనతో ఏపీ ప్రభుత్వమూ పోర్టుల వద్ద 5-10 వేల ఎకరాల భూములను పరిశ్రమల కోసం కేటాయించనున్నట్లు వివరించారు. ఓడరేవులకు అనుసంధానం ఉండేలా ఏపీఐఐసీ ద్వారా భూమిని పరిశ్రమలకు కేటాయిస్తున్నామన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ-ప్రైవేటు రంగ పోర్టులన్నీ డీప్ వాటర్ పోర్టులేనని స్పష్టం చేశారు.

మరో మూడు కొత్త పోర్టులు ప్రభుత్వ రంగంలో, మరొకటి ప్రైవేటు రంగంలో నిర్మాణం అవుతున్నాయి. భారీ నౌకలు రాకపోకలు సాగించేలా డీప్ డెప్త్ వాటర్ పోర్టులను నిర్మిస్తున్నాం. దేశవ్యాప్తంగా పోర్టుల్లో సగటు లోతు 13 మీటర్లు మాత్రమే ఉంటే.. ఏపీలో అది 18 మీటర్ల లోతు. - రవీంద్రారెడ్డి, సీఈఓఏపీ మారిటైం బోర్డు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఒకేచోట పరిశ్రమల్ని గుమ్మరించారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముంబైలో ఏపీ పరిశ్రమల శాఖ నిర్వహిస్తున్న రోడ్ షోకు హాజరైన మంత్రి... విభజన తర్వాత ఏపీ పారిశ్రామికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్​లో అందుకే పోర్టులు, రహదారులు, రైల్ నెట్​వర్క్​లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలకు చుట్టుపక్కలే ఏపీలోని నగరాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వాటికి ఆనుకునే పరిశ్రమలకు కేటాయించేలా భూములు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ నగరాలకు అనుసంధానమైన పోర్టుల ద్వారా తూర్పు ఆసియా దేశాలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చన్నారు.

ప్రస్తుతం ఏపీలో సుస్థిరమైన రాజకీయ నేపథ్యం ఉన్న ప్రభుత్వం ఉందని.. తద్వారా సుస్థిరమైన విధానాలతో పెట్టుబడులకు అనుకూలమని మంత్రి పదేపదే పెట్టుబడి దారులకు వివరించారు. మెడ్ టెక్ జోన్ లాంటి వైద్య పరికరాల జోన్, పెట్రో కెమికల్ కారిడార్ లాంటి పారిశ్రామిక అనుకూల వ్యవస్థలూ ఉన్నట్టు మంత్రి వివరించారు. కియా, ఇసుజూ, అశోక్ లేలాండ్ లాంటి ఆటోమైబైల్ సంస్థలు ఏపీలో ఉన్నాయని.. ఏపీలో ప్రతీ సెకెన్ వ్యవధిలో ఓ సెల్​ఫోన్ తయారు అవుతోందన్నారు.

ఆంధ్రప్రదేశ్​లో 888 కిలోమీటర్ల జాతీయ జలరవాణా మార్గం అందుబాటులో ఉంది. 2029 నాటికి 10 మిలియన్ టన్నుల సరకు జలరవాణా మార్గాల్లో జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లోనూ సమతుల అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. విశాఖ లాంటి అందమైన, కాస్మొపాలిటన్ నగరానికి పెట్టుబడులతో రావాలని కోరుతున్నాం. - రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి

ఏపీలోని అపారమైన వనరుల్ని అందిపుచ్చుకోవాలని మహారాష్ట్రలోని పెట్టుబడిదారులను కోరుతున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఏపీలో పాలన వికేంద్రీకరణ కోసం గ్రామవార్డు సచివాలయాల పేరిట పౌరులకు విస్తృత సేవలందిస్తున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన రాజకీయ సుస్థిరత ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా అభివృద్ధికి, సంక్షేమానికి సమానంగా నిధులు కేటాయిస్తోందని వెల్లడించారు.

విశాఖలో మరో 50 ఏళ్లకు కూడా తాగు నీటికి ఇబ్బంది లేకుండా గోదావరి నుంచి నీటి సరఫరా ప్రణాళిక ఉంది. విశాఖను స్మార్ట్ సిటీగా, ఆర్థికంగా మౌలిక వసతుల పరంగా అత్యున్నతంగా తీర్చిదిద్దుతాం. మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణం చేపడతాం. - ఆదిమూలపు సురేష్, ఏపీ పురపాలక శాఖ మంత్రి

దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లు ఉంటే అందులో ఏపీలోనే 3 ఉన్నాయని, పరిశ్రమలకు ఎంత అనుకూలమో ఇది స్పష్టం చేస్తుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి జి.అమర్నాథ్ తెలిపారు. పరిశ్రమల అవసరాల కోసం 48 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం 530 పారిశ్రామిక ఎస్టేట్లు, 293 పారిశ్రామిక పార్కులు, 3 ఐటీ సెజ్ లు, 6 స్పెషల్ ఎకనామిక్ జోన్ లు ఏపీలో ఉన్నాయన్నారు. లక్ష ఎకరాల్లో పరిశ్రమలు పని చేస్తున్నాయన్నారు.

ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటులో కీలక వనరులు అందుబాటులో ఉన్నాయి. ఏపీ భవిష్యత్ రాజధాని విశాఖకు రావాల్సిందిగా మహారాష్ట్రలోని పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాను. - గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలశాఖ మంత్రి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.