కడప జిల్లా పులివెందులలో తనపై నమోదు అయిన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలంటూ తెదేపా నేత వంగలపూడి అనిత హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఆమె అరెస్ట్ విషయంలో తొందరపడవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పులివెందులలోని ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన అనితపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని పిటీషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఎస్సీ అయిన ఆమె పై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారని పోలీసులను ప్రశ్నించింది. పిటీషనర్ కుల ధృవీకరణ పత్రాలను పరిశీలించి.. కేసును క్లోజ్ చేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: కార్పొరేషన్ కార్యాలయాలు సందర్శించిన మంత్రి వేణుగోపాల కృష్ణ