విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీగా పనిచేస్తున్న నవాబ్ జాన్‌ను పదోన్నతిపై ట్రాఫిక్ డీసీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్‌కు చెందిన ఈయన నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎస్సై, సీఐగా పనిచేశారు. ఆ తరువాత ఏలూరు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీగా, ధర్మవరం డీఎస్పీ, అనిశా డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు బదిలీపై వచ్చారు. విజయవాడ సౌత్ జోన్ ఇంఛార్జ్ ఏసీపీగా కొంతకాలం పనిచేసి... ఆ తరువాత స్పెషల్ బ్రాంచి అదనపు డీసీపీగా పదోన్నతి పొందారు. తాజాగా విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా పదోన్నతి పొందారు. ఆయన 24తేదీ ఉదయం ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు స్వీకరిస్తారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. నవాబ్ జాన్ ఈ నెలాఖరకు పదవీ విరమణ చేయనున్నారు.
ఇదీ చూడండి. తిరుపతిలో రోడ్డుపై బైఠాయించి మహిళ ఆందోళన