ETV Bharat / state

Probation: గ్రామ, వార్డు సిబ్బందికి ప్రొబేషన్.. ఉత్తర్వులు జారీ - ప్రొబేషనరీ గుర్తింపు

Gram ward secretariats staff : ఎట్టకేలకు పోరాటం ఫలించింది.. మూడేళ్ల ఎదురుచూపులకు మోక్షం లభించింది. ప్రైవేటులో వేలకు వేలు వేతనం వచ్చే అవకాశాలున్నా వదులుకుని.. ప్రభుత్వ ఉద్యోగమనే ఒకే ఒక్క కారణంతో గ్రామ వార్డుసచివాలయాల ఉద్యోగులు విధుల్లో చేరారు. కానీ, చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకురాలేక అప్పుల బారిన పడ్డారు. ఈ నేపథ్యాన మూడేళ్ల వారి పోరాటం ఫలించింది. ప్రొబేషనరీ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 17, 2023, 10:35 PM IST

Gram ward secretariats staff : గ్రామవార్డు సచివాలయాల్లో మిగిలిన సిబ్బందికి ప్రొబేషన్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 నోటిఫికేషన్​లో ఎంపికైన గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం సూచించిన శాఖాపరమైన పరీక్ష ఉత్తీర్ణత సాధించటంతో పాటు రెండేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి మాత్రమే ఈ ప్రొబేషనరీ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంటూ ఆదేశాలు వెలువడ్డాయి. వారందరికీ 2023 మే 1వ తేదీ నుంచి కొత్త పేస్కేళ్లు వర్తిస్తాయని గ్రామవార్డు సచివాలయ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఫలించిన పోరాటం.. ఉద్యోగంలో చేరి మూడేళ్లయినా ప్రొబేషన్‌ ఖరారవ్వక, చాలీచాలని వేతనాలతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేటు సంస్థల్లో.. అధిక వేతనం ఇస్తున్నా కాదనుకుని, ప్రభుత్వ ఉద్యోగం కావడంతో విధుల్లో చేరారు. ప్రొబేషన్‌ ఖరారైతే జీతం పెరుగుతుందని భావించారు. అయితే సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్, క్రమబద్ధీకరణ 2022 జూన్‌ 30లోగా పూర్తి చేస్తామని చెప్పినా హామీ అమలు కాలేదు. గత సంవత్సరం జనవరిలో రెండు రోజులుగా ఆందోళన చేయడంతో పాటు విధుల బహిష్కరణకు సిద్ధపడ్డారు.

జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.. ఉద్యోగాల నియామక ప్రక్రియ జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. ఆ మేరకు ప్రొబేషన్‌ ప్రక్రియను కలెక్టర్లు పూర్తి చేస్తారని 2021 సెప్టెంబర్ 29న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రొబేషన్‌ ఖరారు చేయదలచిన ఉద్యోగుల జాబితాలను కలెక్టర్లు సంబంధిత ప్రభుత్వ శాఖల రాష్ట్రస్థాయి విభాగాధిపతులకు పంపాలని 2021 డిసెంబర్ 17న విడుదల చేసిన మరో సర్క్యులర్‌లో సూచించారు.

ప్రైవేటు ఉద్యోగాలు వదులుకుని.. ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతనే ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారైనట్లు భావించి.. సవరించిన వేతనాలు అమలు చేయాలని వార్డు, సచివాలయాల శాఖ స్పష్టం చేసింది. ప్రొబేషన్‌ ఖరారైతే ఒక్కో ఉద్యోగికి నెలకు సుమారు రూ.25వేల వేతనం అందించాల్సి ఉంటుంది. అంటే.. ప్రతీ నెల రూ. 336 కోట్లు అవసరం. ప్రభుత్వ ఉద్యోగమనే ఒకే ఒక్క కారణంతో కొందరు ప్రైవేటులో రూ.30 వేల నుంచి రూ. 40 వేలు వేతనాన్ని కూడా వదులుకొని సచివాలయ ఉద్యోగాల్లో చేరారు. అలాంటి వారంతా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేలు.. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, రోజువారీ ఖర్చులకు కూడా సరిపోకపోవడంతో అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రొబేషన్‌ ఖరారు చేయడంలో ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే.. మరింత గడ్డు పరిస్థితులు తప్పవని వాపోతున్నారు.

ఎట్టకేలకు ఫలించిన పోరాటం.. సచివాలయాల్లో చేరిన వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించింది. తీరా మూడేళ్లు పూర్తయినా వేతనాలు పెంచకపోతే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు పోరాటం ఫలించి ప్రొబేషనరీ గుర్తింపు దక్కుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.