'మాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను భర్తరఫ్ చేయాలి' అంటూ రాష్ట్ర ఉపాధి హామీ కార్మికుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. తమ కష్టాన్ని కించపరుస్తూ.. మంత్రి వ్యాఖ్యలు చేశారని నేతలు ఆవేదన చెందారు. రెక్కాడితే కానీ.. డొక్కాడని తమకు.. మంత్రి వ్యాఖ్యలు మరింత బాధ కలిగించాయన్నారు.
తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఎండావానలను సైతం లెక్కచేయకుండా.. పనిచేసే తమకు కనీస సౌకర్యాలు కల్పించకపోగా.. ప్రభుత్వ పెద్దలు ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం తగదని రాష్ట్ర ఉపాధి హామీ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.సాంబశివరావు హితవు పలికారు.
ఇదీ చదవండి:
తితిదే నిధులతో బాండ్ల కొనుగోలుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం