అంగన్వాడీ కేంద్రాలకు ఆహారధాన్యాల పంపిణీ సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు... కృష్ణా జిల్లాలో గట్టిగా వినిపిస్తున్నాయి. అంతంతమాత్రం అందే ఆహార ధాన్యాలతో... చిన్నారుల ఆకలి తీర్చేందుకు అంగన్వాడీ కార్యకర్తలు నానా తంటాలు పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో గత రెండు నెలల నుంచి చిన్నారులకు, బాలింతలకు ఇవ్వాల్సిన శనగల పంపిణీ సక్రమంగా జరగడంలేదు. ఫలితంగా చిన్నారులు ఆహార సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను అంగన్వాడీకి పంపేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికైనా సక్రమంగా పంపిణీ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ప్రకాశం జిల్లాలో ఆగిన బాలామృతం... అందని పౌష్టికాహారం