ETV Bharat / state

రూ. పది వేలు డ్రా చేస్తే.. పది నోట్లకు చెదలే! - మైలవరంలో ఏటీఎం నుంచి చెదలు పట్టిన నోట్లు

అక్షరాలా పది 500 కరెన్సీ నోట్లకు చెదలు పట్టాయి. అదేదో ఇంట్లో భద్రపరిచి అటుపై.. మరచిపోవటం వల్ల పట్టిన చెదలు కాదండోయ్​. నిత్యం ప్రజలు ఉపయోగించే ఏటీఎం నుంచి వచ్చాయి. ఇదేంటని బ్యాంకు వారిని అడిగితే.. ఆ డబ్బు తమది కాదు పొమ్మనారు సదరు అధికారులు. పాపం బాధితుడు చేసేది లేక.. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Term notes from atm in krishna district
Term notes from atm in krishna district
author img

By

Published : Apr 30, 2021, 8:02 AM IST

Updated : Apr 30, 2021, 9:25 AM IST

కృష్ణా జిల్లా మైలవరంలోని స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంలో చెదలు పట్టిన నోట్లు కలకలం రేపాయి. మైలవరానికి చెందిన చాట్ల సుధాకర్ అనే వ్యక్తి.. ఎస్బీఐ శాఖకు ఎదురుగా ఉన్న అదే బ్యాంకు ఏటీఎంలో.. 10 వేల రూపాయల నగదు డ్రా చేశారు. అయితే అందులో పది కరెన్సీ(500) నోట్లు చెదలు పట్టి ఉన్నాయి. వెంటనే సుధాకర్‌..బ్యాంకు మేనేజర్‌ను ఆశ్రయించారు. చెదలు పట్టిన నోట్లు వచ్చాయని మైలవరం బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. అయితే ఈ నోట్లు తమ బ్యాంకువి కాదని బాధితుడి పట్ల.. బ్యాంకు మేనేజర్‌ దురుసుగా ప్రవర్తించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమక్షంలో ఏటీఎం ఓపెన్ చేయాలని బాధితులు కోరగా అందుకు మేనేజర్ నిరాకరించాడు.

ఇదీ చదవండీ.. వ్యాక్సిన్ల కోసం ఉత్పత్తి కంపెనీలతో రాష్ట్రం సంప్రదింపులు

Last Updated : Apr 30, 2021, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.