ETV Bharat / state

Minor Girl Rape: దారుణం.. పదేళ్ల బాలికపై అత్యాచారం.. మరోచోట స్వయాన మేనమామే.. - గుంటూరులో మేనమామ అత్యాచార ఘటన

Minor Girl Rape in Krishna District : పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారంటే తల్లిదండ్రులకు మనసులో ఏదో వెలితి. సమయానికి తిన్నారో.. లేదో, ఆరోగ్యం బాగుందో.. లేదో అనే సవాలక్ష సందేహలు కన్నవారి మనసులో మెదలుతూనే ఉంటాయి. అదే పిల్లలు ఉన్న ప్రాంతంలో బంధువులో, తెలిసిన వారో ఎవరైనా ఉన్నారంటే.. తల్లిదండ్రులకు కాస్త ఊరటగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఆ తల్లిదండ్రులకు అదే శాపంగా మారింది. సమీప బంధువే వారి కూతురిపై అఘాయిత్యానికిి ఒడిగట్టాడు. మరోచోట స్వయాన మేనమామే.. స్నేహితుడితో కలిసి కీచక చర్యకు పూనుకున్నాడు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 22, 2023, 9:50 AM IST

Ten Years Old Girl Rape In Krishna: ఎటు వెళ్తోంది ఈ లోకం. ఎక్కడి నుంచి ఎక్కడకు వచ్చాము.. రాయితో నిప్పును పుట్టించిన దగ్గరి నుంచి అంతరిక్షంలో విహరించే వరకు ఎదిగాము. ఇంతా ఎదిగినా మానవుడు తన విచక్షణను కోల్పోతున్నాడు. కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. మనుషులమనే సంగతి మరిచిపోయి కొందరు కీచకులు వావీవరసలు కూడా మరచిపోతున్నారు. హత్యలు, హత్యాచారాల వంటి దారుణానికి ఒడిగడుతున్నారు. సమీప బంధువైన వరుసకు అన్న అయ్యే వ్యక్తి.. మరో ఇద్దరితో కలిసి పదేళ్ల చిన్నారిపై లెంగిక దాడికి పూనుకున్నాడు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు గుంటూరు జిల్లాలో స్వయాన మేనమామే అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కృష్ణా జిల్లా నందివాడ మండలానికి చెందిన ఓ బాలిక కుటుంబం చేపల చెరువులపై కాపలాగా ఉంటోంది. వారి కుమార్తెను ఏలూరు జిల్లాలోని ఓ గ్రామంలో వసతి గృహంలో ఉంచి ఐదో తరగతి చదివిస్తున్నారు. సమీప బంధువులు కూడా ఆ గ్రామంలోనే అద్దెకు ఉండడంతో.. తమ కూతుర్ని కనిపెట్టుకుని ఉంటారని ఆశించారు. ఆ ఆశే చిన్నారి పాలిట శాపంగా మారింది.

అన్న వరసైన సమీప బంధువైన రాంబాబు.. వారు ఉంటున్న ఇంటికి బాలికను తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటియజమాని స్నేహితుడైన భైరవపట్నానికి చెందిన షేక్‌ ఖాదర్‌కు ఈ విషయం తెలిసింది. రాంబాబును మందలించకుండా అతనితో కలిసి పలుమార్లు దారుణానికి ఒడిగట్టాడు. ఈ సమయంలో ఇంటి యజమాని కుమారుడైన 13 ఏళ్ల బాలుడు చూశాడు. విషయాన్ని ఎక్కడైనా చెబుతాడనే భయంతో.. ఆ బాలుడికీ నీలిచిత్రాలు చూపించి బాలికపై అత్యాచారం చేసేలా ప్రోత్సహించారు.

ముగ్గురు కలిసి 4 నెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇటీవలే చిన్నారి అస్వస్థతకు గురైంది. చిన్నారి నలతగా ఉండటాన్ని గుర్తించిన వసతి గృహం వార్డెన్‌ ఆమెను ప్రశ్నించారు. అదే సమయంలో చిన్నారిని తీసుకెళ్లేందుకు రాంబాబు వచ్చారు. అతన్ని చూసి బాలిక భయంతో కేకలు వేసింది. వార్డెన్ విషయాన్ని గ్రహించి ఏమైందని ప్రశ్నించగా.. వణికిపోతూనే బాలిక జరిగిన విషయం చెప్పింది.

ఈ విషయం చివరికి తల్లిదండ్రులకు తెలిసింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు గ్రామీణ డీఎస్పీ శ్రీనివాసులు వార్డెన్‌ నుంచి వివరాలు సేకరించారు. నిందితులు ఖాదర్‌, మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు విశాఖ పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

గుంటూరులో దారుణానికి ఒడిగట్టిన మేనమామ: జిల్లాలో ఓ మైనర్ బాలికపై స్వయాన మేనమామ అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలిక మేనమామ, అతని స్నేహితుడు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు రాగానే ఆ బాలిక అత్యాచారం విషయం చెప్పడంతో వారు మేనమామ అతని స్నేహితుడిని ప్రశ్నించారు. పోలీసులకు చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించారు.

రెండు రోజులు తర్వాత తల్లిదండ్రులు పనికి వెళ్లిన తర్వాత మధ్యహ్న సమయంలో.. బాలికపై మరోమారు దారుణానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలను నిమిత్తం బాలికను గుంటూరు ఆస్పత్రికి తరలించారు.

స్కూల్​​ టాయిలెట్​లో 11 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.