ETV Bharat / state

నందిగామ కేంద్రీయ విద్యాలయానికి తాత్కాలిక భవనం సిద్ధం - temporary building for kendriya vidyalaya

కృష్ణా జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి తాత్కాలిక భవనాన్ని అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. శాశ్వత భవనాల నిర్మాణానికి ఏర్పాటు జరుగుతున్నాయన్న పిన్సిపల్.. తరగతుల ప్రారంభంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే వివరాలు తెలియజేస్తామని అన్నారు.

కేంద్రీయ విద్యాలయానికి తాత్కాలిక భవనం సిద్ధం

author img

By

Published : Oct 7, 2021, 5:10 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు తాత్కాలిక భవనాన్ని(kendriya vidyalaya temporary buildings got ready) అధికారులు సిద్ధం చేశారు. మధిర రోడ్డులోని అయ్యదేవర కాళేశ్వర భవనంలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భవనానికి రూ. 60 లక్షలతో మరమ్మతులు చేసి పూర్తి స్థాయి వినియోగానికి సిద్ధం చేశారు.

ఈ భవనంలో మెుత్తం 14 తరగతి గదులు, ప్రిన్సిపల్, సిబ్బంది రూములను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేశారు. కేంద్రీయ విద్యాలయం విజయవాడ ప్రిన్సిపల్ హరియోమ్ ఉపాధ్యాయ, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు లు పరిశీలించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి తరగతులు ఎప్పటినుంచి ప్రారంభం చేయాలనే విషయాన్ని తెలియజేస్తామని ప్రిన్సిపల్ తెలిపారు. ఆ తరువాత పట్టణ శివారులోని హనుమంతు పాలెం వద్ద కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల భూమిని పరిశీలించారు.

ఇదీ చదవండి:

PENSION LATE : 'ఠంచనుగా పింఛను..' ఏదీ ? : గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.