ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేసేందుకు కృషి చేసిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఇంటర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేయించారని తెలుగు యువత నాయకుడు వల్లూరు కిరణ్ అన్నారు.
ఇదీ చదవండి: