ETV Bharat / state

'ట్విట్టర్​లో సందేశాలే కాదు.. తెలుగు భాషాభివృద్ధికీ శ్రమించాలి'

author img

By

Published : Aug 29, 2021, 4:19 PM IST

Updated : Aug 29, 2021, 7:16 PM IST

తెలుగు భాషా దినోత్సవాన్ని కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో మండలి బుద్ధప్రసాద్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేశారు. ప్రజల్లో తెలుగుపై గౌరవాభిమానాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Gidugu Ramamurthy Jayanti celebrations
ఆవనిగడ్డ గాంధీ క్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవం

ప్రాచిన విశిష్ట బాషా కేంద్రానికి 5 ఏకరాల స్థలం కేటాయింటాలి

తెలుగు మాధ్యమాన్ని తీసివేయడం, ప్రతిష్టాత్మకమైన తెలుగు అకాడమీకి సంస్కృతం జోడించిన తీరుతో.. ప్రభుత్వానికి తెలుగుపై ఎంతంటి మమకారం ఉందో తెలుస్తోందని రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి తెలుగుపై మధుర గీతాలు ఆలపించారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజల్లో తెలుగుపై గౌరవాభిమానాలు పెంపొందించడానికి చర్యలు చేపట్టకుండా.. ట్విట్టర్​లో సందేశాలు పెట్టి సరిపెట్టుకోవడం సరికాదని అన్నారు.

తెలుగువారి ఉద్యమాలతో ప్రాచీన హోదా..

ప్రాచీన హోదా కోసం తెలుగువారు ఎన్నో ఉద్యమాలు చేశారు. వాటి ఫలితంగానే 2008లో కేంద్రం ప్రాచీన హోదా ప్రకటన చేయగా.. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చొరవతో 2019లో నెల్లూరుకు భాషాభివృద్ధి కేంద్రం వచ్చింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల స్థలం కేటాయించాల్సి ఉంది. అయితే రెండేళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది తప్ప.. ఈరోజు వరకు స్థలం కేటాయించలేదు. సొంత భవనాలు ఉంటే తప్ప ఈ కేంద్రానికి స్వయం ప్రతిపత్తి లభించదు. భవనాలు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నా.. స్థలం ఇవ్వడానికి జాప్యం చేయడంలో అంతరార్థం.. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుపై ఉన్న చిన్న చూపే. తెలుగు బాషా దినోత్సవం సందర్బంగా ప్రాచిన విశిష్ట బాషా కేంద్రానికి స్థలాన్ని కేటాయిస్తూ.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేయాలి. - మండలి బుద్ధప్రసాద్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు

ఇదీ చదవండి:

Minister Avanthi: తెలుగు అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కృషి: మంత్రి అవంతి

Last Updated : Aug 29, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.