ETV Bharat / state

తెలంగాణ: డాక్టర్ల రక్షణ కోసం వాట్సాప్ గ్రూపులు

తెలంగాణలో వైద్యులకు రక్షణ కల్పించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. వైద్యులు, పోలీసులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి భద్రత కల్పించనున్నారు. ఇటీవల డాక్టర్లపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని పోలీసులతో సమన్వయం చేసుకుని మరింత సేవలందించేందుకు ఈ వాట్సాప్‌ గ్రూపులు ఉపయోగపడుతాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

telangana-police-department-has-taken-steps-to-protect-the-doctors-to-create-a-whatsapp-group
డాక్టర్ల రక్షణ కోసం వాట్సప్ గ్రూపులు
author img

By

Published : Apr 5, 2020, 4:43 PM IST

కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులు ఇతర అధికారుల భద్రతకు పోలీసులు మరిన్నీ చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యులకు ఆయా పోలీసు స్టేషన్‌ల పరిధిలో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి భద్రత కల్పించనున్నారు. డాక్టర్లపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని పోలీసులతో సమన్వయం చేసుకుని మరింత సేవలందించేందుకు ఈ వాట్సాప్‌ గ్రూపులు ఉపయోగపడతాయని ఆ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవసరం ఉన్న ఈ గ్రూపుల్లో సమాచారాన్ని పంచుకుంటే వేగంగా స్పందిస్తామని డీజీపీ పేర్కొన్నారు.

డాక్టర్లు చేస్తున్న కృషికి సలాం చేస్తున్నామన్నారు. ఎవరైతే ఈ వాట్సాప్‌ గ్రూపుల్లో ఉన్నారో ఎటువంటి అవసరం వచ్చినా వేగంగా స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసులకు వైద్యులతో కలిపి మెడికల్ నోడల్ వాట్సాప్‌ గ్రూప్ ఏర్పాటు చేశారు. నోడల్ అధికారిగా ఇన్‌స్పెక్టర్ ఉంటారు. ఇందులో ఏసీపీ, బస్తీ దవాఖాన డాక్టర్లు ఇతర సిబ్బంది, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆశా వర్కర్లు, హెల్త్‌వర్కర్లు ఉంటారని స్పష్టం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో వైరస్‌ను ఎదుర్కొంటామని డీజీపీ వివరించారు.

ఇదీ చూడండి: భయపడితే రోగనిరోధక శక్తి తగ్గుతుంది: మానసిక వైద్య నిపుణుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.