అమరావతి అన్నదాతలకు తెలంగాణ రైతుల మద్దతు - అమరావతి ఆందోళనలు
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం వద్ద రాజధాని అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు... తెలంగాణ రైతులు ర్యాలీగా వచ్చారు. ఖమ్మం, మధిర, వైరా నుంచి పెద్దఎత్తున వచ్చి... అమరావతి కోసం ఉద్యమిస్తున్న అన్నదాతలకు సంఘీభావం తెలిపారు. వీరికి ఐకాస నేతలు ఘనస్వాగతం పలికారు. కంచికచెర్లకు వద్దకు చేరుకున్న ర్యాలీకి మాజీమంత్రి దేవినే ఉమ, మాజీఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్వాగతం పలికారు.