ETV Bharat / state

తెలంగాణలో కొవిడ్‌ కోరల్నించి బయటపడినవారు లక్ష మందికి పైనే - తెలంగాణ కరోనా మరణాలు

మార్చి 2న తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకూ కొవిడ్‌ చికిత్సలపై వైద్య నిపుణుల్లో మరింత స్పష్టత వచ్చింది. ప్లాస్మాథెరపీ సహా ప్రయోగాత్మకంగా వేర్వేరు ఔషధాలను చికిత్సల్లో వినియోగిస్తున్నారు. ప్రజల్లోనూ కొంత అవగాహన పెరిగింది. ఇలాటి కారణాల వల్ల కొవిడ్‌ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొని పెద్ద సంఖ్యలో విజేతలుగా నిలుస్తున్నారు. కోలుకునే వారి సంఖ్య పెరగడంపై వైద్య వర్గాల విశ్లేషణ ఇది.

Telangana corona cases
తెలంగాణ కరోనా కేసులు
author img

By

Published : Sep 4, 2020, 8:29 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ కోరల్లో చిక్కుకొని, చికిత్సానంతరం ఆరోగ్యవంతులుగా మారుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. బుధవారం మరో 2,611 మంది ఇలా బయటపడ్డారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,00,013కు చేరుకుంది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో కోలుకున్నవారు 74.9 శాతం మంది. ఈ విషయంలో జాతీయ సగటు 77.09 శాతమని వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాతో రాష్ట్రంలో 32,537 మంది చికిత్స పొందుతుండగా.. వీరిలో ఆసుపత్రుల్లోని ఐసొలేషన్‌ కేంద్రాల్లో, ఇళ్లలో ఉండి వైద్యసేవలు పొందుతున్నవారు 25,293 మంది ఉన్నారు. గత మూణ్నెల్లుగా ఇళ్లలో ఉండి చికిత్స పొందుతూ కొవిడ్‌ను జయించినవారు కూడా దాదాపు 70 శాతానికి పైగానే ఉన్నట్లు వైద్యవర్గాలు చెప్పాయి.

15.42 లక్షలు దాటిన పరీక్షలు

బుధవారం కొత్తగా 2,817 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తంగా కేసుల సంఖ్య 1,33,406కు పెరిగింది. మొత్తం పాజిటివ్‌ల్లో ఎటువంటి లక్షణాలు లేనివారు 92,050(69శాతం) మంది కాగా, కొవిడ్‌ లక్షణాలతో నిర్ధారణ అయినవారు 41,356(31శాతం) మంది ఉన్నారు. ఈ నెల 2న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసింది. తాజా ఫలితాల్లో మరో 10 మంది మహమ్మారికి చిక్కి బలయ్యారు. ఇప్పటి వరకూ కొవిడ్‌ మరణాల సంఖ్య 856కు చేరింది.

15లక్షలు దాటిన పరీక్షలు

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 59,711 నమూనాలను పరీక్షించగా వీరిలో ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులు 26,869(45శాతం) మంది, సెకండరీ కాంటాక్టు వ్యక్తులు 8,359(14శాతం) మంది ఉన్నారు. దీంతో మొత్తంగా పరీక్షల సంఖ్య 15,42,978కి పెరిగింది. ప్రభుత్వ వైద్యంలో కరోనా చికిత్సల కోసం మొత్తం 7,952 పడకలను కేటాయించగా, బుధవారం నాటికి ఇంకా 5,178 ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు వైద్యంలో 10,063 కేటాయించగా, 5,593 పడకలు అందుబాటులో ఉన్నాయి.

జిల్లాల్లో అదే ఉద్ధృతి

జిల్లాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత నెల 27 నుంచి ఈ నెల 2 వరకూ వారం రోజుల కొవిడ్‌ కేసుల నమోదు సరళిని పరిశీలిస్తే.. జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో గత నెల 27న 520 కేసులు నమోదవగా తాజాగా 452 పాజిటివ్‌లను ఇక్కడ నిర్ధారించారు. 9 జిల్లాల్లో రోజుకు సగటున 100 కేసులకు పైగానే నిర్ధారణ అవుతున్నాయి. 20-90 మధ్య కేసులు నిర్ధారణ అయిన జిల్లాల్లో భదాద్రి కొత్తగూడెం(89), జగిత్యాల(88), సంగారెడ్డి(76), పెద్దపల్లి(75), యాదాద్రి భువనగిరి(73), మంచిర్యాల(71), మహబూబాబాద్‌(62), కామారెడ్డి(62), రాజన్న సిరిసిల్ల(53), వరంగల్‌ గ్రామీణ(46), వనపర్తి(45), మహబూబ్‌నగర్‌(42), జనగామ(41), నాగర్‌కర్నూల్‌(41), ఆదిలాబాద్‌(36), మెదక్‌(35), జోగులాంబ గద్వాల(33), వికారాబాద్‌(27), జయశంకర్‌ భూపాలపల్లి(26), నారాయణపేట(21) ఉన్నాయి.

ఇదీ చూడండి. రైతులపై ఒక్క పైసా భారం పడబోదు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.