అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు విజయవాడ నరగంలో వివిధ ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు. నగరంలోని ఇబ్రహీంపట్నంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్పెషల్ అధికారి ఎం. సత్తిబాబు ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. అక్రమంగా తరలిస్తున్న 1,114 బాటిళ్ల తెలంగాణ మద్యంను పట్టుకున్నారు.
పదిమంది నిందితులను అదుపులోకి తీసుకుని..11 సెల్ఫోన్లు, మూడు కార్లు, ఒకలారీ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తులు యూట్యూబ్ ఛానల్లో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడులలో ప్రధాన నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ సోదాలలో ఎస్ఈబీ అధికారులు హనీష్, జి. శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, గురుప్రకాష్ , భరత్, రవి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి. అయోధ్యలో ఎలుకల గండం.. 'ఏం చేస్తే పోతాయి?'