ETV Bharat / state

వైకాపా నాయకులకు పట్టిన దాడుల దాహాన్ని త్వరలోనే తీరుస్తాం: అచ్చెన్న

ముష్కరుల మాదిరి దారికాచి తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడులకు తెగబడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కృష్ణాజిల్లా నూజివీడులో తెదేపా కార్యకర్తలు మణి, నాగబాబుపై 'వైకాపా గూండాలు' చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిచారు.

author img

By

Published : Jul 18, 2021, 12:38 PM IST

tdp state president Atchannaidu
tdp state president Atchannaidu

కృష్ణాజిల్లా నూజివీడులో తెదేపా కార్యకర్తలు మణి, నాగబాబుపై 'వైకాపా గూండాలు' చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. వైకాపా ముష్కరులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. ముష్కరుల మాదిరి దారికాచి తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే నిందితులపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వైకాపా నాయకులకు పట్టిన దాడుల దాహాన్ని త్వరలోనే తీరుస్తామన్నారు. తెదేపా వారితో ఎందుకు పెట్టుకున్నామా అని వైకాపా నాయకులు దిగులు పడే రోజు దగ్గర్లలోనే వుందని అన్నారు.

tdp state president Atchannaidu
తెదేపా నాయకులపై దాడులను ఖండిస్తూ లేఖ..

దాడి చేసిన వారిపై తెదేపా కార్యకర్తలు కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఆక్షేపనీయమన్నారు. బాధితులపైనే కేసులు పెట్టే వింత సాంప్రదాయానికి ఏపీ పోలీసులు నాంది పలికారని విమర్శించారు. పోలీసులు వేసుకుంది నీలి చొక్కాలు కాదు.. ఖాకీ చొక్కాలన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శాంతిభ్రదతల పట్ల డీజీపీకి విశ్వాసం ఉంటే ఇప్పటి వరకు జరిగిన అరాచకాలపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

కన్నపేగు కైలాస రథాన... కామధేను కన్నీటి పథాన

250 ఏళ్ల నాటి విస్కీ బాటిల్​కు రికార్డు ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.