TDP protests against Chandrababu arrest : చంద్రబాబు అరెస్టుపై తెలుగుదేశం ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు 'బాబుతో నేను' (Me with Babu) అంటూ రెండో రోజూ నిరాహార దీక్షలు చేపట్టారు. బాబును అక్రమ కేసులో ఇరికించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి విడుదల కావాలంటూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు రోడ్డెక్కారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (skill development case) లో బాబుపై అక్రమ కేసులు పెట్టి... జైల్లో పెట్టడం దారుణమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని నిరసిస్తూ.. తెలుగుతమ్ముళ్లు ఆందోళన బాట పట్టారు. బాబుతో నేను అనే నినాదంతో చేపట్టిన దీక్షలను రెండో రోజూ కొనసాగిస్తున్నారు. చంద్రబాబును విడుదల చేయాలంటూ... కడప జిల్లా మైదుకూరులో చాపాడు మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసనకు దిగారు. చంద్రబాబును అక్రమంగా కేసుల్లో ఇరికించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు.
కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలోనూ రిలే నిరాహార దీక్షలు (Relay hunger strikes)కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు సంఘీభావంగా నేతలు నిరసనలు చేపట్టారు. ఆధారాల్లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించారని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని నేతలు ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా (Nellore District)లోనూ రెండో రోజు టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయం వద్ద నేతలు నిరసన చేపట్టారు. చంద్రబాబుకు మద్దతు (Support for Chandrababu)గా ఆత్మకూరు బస్టాండ్ వద్ద తెలుగుదేశం శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దీక్షలకు అనుమతి లేదంటూ మున్సిపల్ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ముందు అనుమతిస్తూ... అధికారులు అనుమతులిచ్చి మళ్లీ నిరాకరిస్తున్నారంటూ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బాసటగా విశాఖ దుర్గాలమ్మ ఆలయం (Visakha Durgalamma Temple)లో తెలుగుదేశం నేతలు పూజలు చేశారు. జైలు నుంచి అధినేత క్షేమంగా బయటకు రావాలంటూ... టెంకాయలు కొట్టారు. చంద్రబాబును జైల్లో ఉంచాలనే కుట్రతోనే స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో ఇరికించారని ఆక్షేపించారు.
చంద్రబాబు అరెస్టుపై తెలుగుదేశం ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుతమ్ముళ్లు 'బాబుతో నేను' అంటూ రెండో రోజూ నిరాహార దీక్షలు చేపట్టారు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో... చాపాడు మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసనకు దిగారు. అక్రమ కేసులో ఇరికించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించారు. చంద్రబాబు నాయుడును విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.
Lokesh Fires on CM Jagan on Skill Case: 'రాజకీయ ప్రతీకారంగానే చంద్రబాబు అరెస్ట్.. జగన్‌లా జైలుకు వెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు'