ETV Bharat / state

పన్నుల భారాన్ని నిరసిస్తూ బత్తినపాడులో తెదేపా ఆందోళన - బత్తినపాడులో తెదేపా ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని విధించడాన్ని నిరసిస్తూ కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలో తెదేపా నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్ని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

పన్నుల భారాన్ని నిరసిస్తూ బత్తినపాడులో తెదేపా ఆందోళన

author img

By

Published : Nov 23, 2020, 3:26 PM IST

కృష్ణాజిల్లా కంచికర్ల మండలం బత్తనపాడులో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ప్రజలపై విధిస్తున్న పన్నుల భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. రేషన్​పై, రాష్ట్ర రహదారులపై టోల్ బాదుడు.. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందిగా మారాయాని తంగిరాల సౌమ్య అన్నారు. రేషన్ సరకులపై పన్నుల భారంతో ఏటా పేద ప్రజానీకంపై 600 కోట్ల రూపాయల భారం పడుతోందన్నారు. పెట్రోల్, డీజీల్​పై విచ్చలవిడిగా టాక్స్ విధిస్తున్నారని ఆరోపించారు. పన్నులపై కాకుండా రైతన్నల కష్టాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని ఆమె సూచించారు.

ఇదీ చదవండి

'నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.