కొవిడ్ సమయంలో వాహనాలపై భారీ మొత్తంలో అపరాధ రుసుము పెంచటం వల్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెదేపా నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాహనాలపై పెంచిన అపరాధ రుసుము తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెదేపా కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు ధ్వంసం అయితే పట్టించుకోని ప్రభుత్వం... అపరాధ రుసుము రూపంలో రూ. వేల కోట్లు దండుకోవడం న్యాయమా అని జిల్లా కార్యదర్శి నవనీతం సాంబశివరావు ప్రశ్నించారు. వెంటనే నాణ్యమైన రహదారులు నిర్మించాలన్నారు. అధిక ఫైన్ విధించే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని సాంబశివరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళ నాయకురాలు, మాజీ కార్పొరేటర్, పలువురు నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: