ETV Bharat / state

Bonda Uma furious with Jagan: కలవరపెడుతున్న పీకే నివేదిక.. జగన్​ వెన్నులో వణుకు: బోండా ఉమ

TDP Polit Bureau Member Bonda Uma : తెలుగుదేశం-జనసేన ఎన్నికలకు ఎలా వెళ్లాలో చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి ఎవరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా నిలదీశారు. తెలుగుదేశం-జనసేన ఉమ్మడిగా కలిసి వెళ్తే వైఎస్సార్సీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదిక జగన్మోహన్ రెడ్డిని కలవరపెడుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఇతరుల గురించి మాటలే రావడం విడ్డూరంగా ఉందని ఉమ ఎద్దేవా చేశారు.

Tdp leader Bonda Uma
Tdp leader Bonda Uma
author img

By

Published : May 16, 2023, 5:18 PM IST

Updated : May 16, 2023, 5:23 PM IST

TDP Polit Bureau Member Bonda Umamaheswara Rao : తన పతనం కళ్ల ముందే జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మదర్స్ డే రోజు జన్మనిచ్చిన తల్లికి కనీస శుభాకాంక్షలు కూడా తెలపని వాడు.. ప్రజలకు మీ బిడ్డనని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో తల్లికి ప్రేమతో షూ లేస్ కట్టిన వ్యక్తిత్వం లోకేశ్​దైతే, కన్నతల్లికి ఉన్న పదవులు పీకేసి రాష్ట్రం నుంచి తరిమేసిన బుద్ధి జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. ఎన్నికలకు సింగిల్‌గా వెళ్తాడో లేక ఎంపీ గోరంట్ల మాధవ్‌లా గుడ్డలు విప్పుకుని వెళ్తాడో అది జగన్మోహన్ రెడ్డి ఇష్టమని అన్నారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా

వైఎస్సార్సీపీకి సింగిల్ డిజిట్ కూడా దక్కదు.. తెలుగుదేశం-జనసేన ఎన్నికలకు ఎలా వెళ్లాలో చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి ఎవరని బోండా ఉమా నిలదీశారు. తెలుగుదేశం-జనసేన ఉమ్మడిగా కలిసి వెళ్తే వైఎస్సార్సీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదిక జగన్మోహన్ రెడ్డిని కలవరపెడుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏమైంది.. ఆయన ముఖంలో కళ లేదేంటని వైఎస్సార్సీపీ నాయకులే చెప్పుకుంటున్నారని అన్నారు. ఎత్తులు, జిత్తులకు కేరాఫ్ అడ్రస్​గా ఉన్న జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఇతరుల గురించి ఆ మాటలే రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 100రోజుల యువగళం పాదయాత్రకు 10 లక్షల మంది సంఘీభావం తెలిపారన్నారు. లోకేశ్ పాదయాత్రలో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారి తాడేపల్లి ప్యాలెస్​లో వణుకు మొదలైందని బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దనే.. ముఖ్యమంత్రికి మతి భ్రమించిందని, నిజాంపట్నంలో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని మాజీమంత్రి ఆలపాటి రాజా ఎద్దేవా చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని ప్రజల్ని మోసగించాడనటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. పేదలకు ఇళ్లు కూడా కట్టించకుండా, భారతీ సిమెంట్స్​ను అధిక ధరకు అమ్ముకుంటున్న మీరా మా గురించి మాట్లాడేదని మండిపడ్డారు. విశ్వసనీయత, అభివృద్ధి గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. అన్ని రాజకీయ పార్టీలు కోరుకునేది ప్రజాస్వామ్యాన్ని కాపాడి, రాజ్యాంగాన్ని రక్షించేందుకేనని స్పష్టం చేశారు. రాజ్యాంగేతర శక్తిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే నిర్ణయానికి ప్రతిపక్షాలు వచ్చాయని వెల్లడించారు. కర్ణాటకలో ఓ పక్క కాంగ్రెస్​కు మరోపక్క బీజేపీకి డబ్బులిచ్చి కుయుక్తులు పన్నింది జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. లోపాయికారిగా గాలి జనార్ధన్ రెడ్డికి ఎన్నికల్లో సాయం చేసింది మీరు కాదా అని జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.

ఇవీ చదవండి :

Last Updated : May 16, 2023, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.