![tdp polit bureau member ayyanna patrudu fires on ycp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8716830_561_8716830_1599495993483.png)
![tdp polit bureau member ayyanna patrudu fires on ycp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8716830_1026_8716830_1599496027247.png)
ఉచిత విద్యుత్ విధానానికి మంగళం పాడటానికే మీటర్ల ఏర్పాటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని వైకాపా సర్కార్ మరింత కుంగదీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా గ్యాస్ సబ్సిడీ సొమ్ము బ్యాంకులో జమ కావడం లేదని, ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ అమలు చేస్తే ఇదే తరహాలో సబ్సిడీ కోసం రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి తలెత్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: