హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలను ఎం చెయ్యాలనుకుంటున్నారు సీఎం జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. డిక్లరేషన్ దగ్గర నుంచి భక్తులపై లాఠీ ఛార్జ్ వరకూ అన్నీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలే అని మండిపడ్డారు. ఒక మహిళని మోసం చేసిన వ్యక్తికి తితిదే పదవి కట్టబెట్టారా అని ధ్వజమెత్తారు. పెళ్లి చేసుకుంటానని ఒక మహిళ జీవితంతో ఆటలాడుకున్న కరణ్ రెడ్డికి తితిదే హైదరాబాద్ సలహా మండలి వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం దారుణమన్నారు. హిందూ ధార్మిక పరిరక్షణకు ఇంతకు మించిన మంచి వ్యక్తి మీకు దొరకలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రత దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం ఇకనైనా ఆపండి అని ట్విట్టర్ ద్వారా సూచించారు. తీతీదేపై మీ ''దరువు'' ఇకనైనా అపకపోతే ఆ తిరుమలేశుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి :