మతాల మధ్య చిచ్చు రేపుతున్న మంత్రి కొడాలి నాని హిందువేనా అని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు ఆలోచనాజ్ఞానం నశించినట్లుగా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మెప్పుకోసమే నాని హిందూమతాన్ని కించపరుస్తున్నారని బుద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు, అధికారం ఉందనే అహంతోనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కొడాలి నానిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని.. లేకుంటే ముఖ్యమంత్రి అండతోనే ఆయన అలా మాట్లాడుతున్నాడని ప్రజలు భావిస్తారని బుద్దా అన్నారు.
ఇవీ చదవండి..