ప్రభుత్వ తీరుకు నిరసనగా కృష్ణా జిల్లా కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నూతన పెన్షన్ విధానాల కారణంగా రాష్ట్రంలో సుమారు 5 లక్షల పెన్షన్లు పోయే పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ రాజధానిపై చేసిన ప్రకటనను నిరసిస్తూ.. గొల్లపూడిలో ధర్నా చేస్తున్న దేవినేని ఉమా అరెస్ట్ అక్రమమని అమె మండిపడ్డారు. పార్టీ నాయకులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: