కృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామంలో తమ పార్టీ కార్యకర్తలపై వైకాపా అనుచరులు దాడి చేయటం దారుణమని తెదేపా నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాం మండిపడ్డారు. ఈ దాడిని డీజీపీ దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. స్థానిక పోలీసు సిబ్బంది... అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో జరుగుతున్న దాడులపై అధిష్టానంతో చర్చిస్తామని వారు అన్నారు. తమ పార్టీ శ్రేణులపై జరిగిన దాడులకు వైకాపా తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి