మూడు రాజధానుల పేరుతో ఎస్సీలకు సీఎం జగన్ అన్యాయం చేస్తున్నారని... టీడీఎల్పీ విప్ డోలా బాలవీరాంజనేయస్వామి మండిపడ్డారు. కూలీలైన అనేకమంది ఎస్సీలు రాజధాని ఏర్పాటుతో కోటీశ్వరులయ్యారని... అది సహించలేక జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు అని చెప్పారు కానీ.. సలహాదారుల పదవుల్లో కనీసం ఒక్క దళితుడినైనా నియమించారా అని ప్రశ్నించారు.
'ఎవరినడిగారు?'
ప్రజామోదంతో ఏర్పాటైన రాజధానిని... జగన్ ఎందుకు మారుస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ఎవరినడిగి రాజధాని మారుస్తున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి సలహాతోనా లేక సజ్జల రామకృష్ణారెడ్డి సలహాతోనా అని నిలదీశారు. తెదేపాను దెబ్బతీయడం కోసం... సీఎం జగన్ 33 వేల ఎకరాలు భూములిచ్చిన 29 వేల మంది రైతుల జీవితాలను, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు.
'జగన్ కుయుక్తులు కుట్రలకు తెరలేపారు'
'అమరావతి భూములను త్యాగం చేసిన రైతులను వంచించి, అసత్య ప్రచారం చేసి రాజధానిని మార్చేందుకు జగన్ కుయుక్తులు... కుట్రలకు తేర లేపారు' అని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా... ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా రైతులు రాజధాని రణభేరి మొదలుపెట్టి నేటికీ 250 రోజులైందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: