ETV Bharat / state

చంద్రబాబు పర్యటనతో వైకాపాకు వణుకు: తెదేపా

author img

By

Published : Nov 29, 2019, 4:02 PM IST

అమరావతిలో చంద్రబాబు పర్యటనకు... ప్రభుత్వం అడుగడుగునా అవాంతరాలు సృష్టించిందని తెదేపా నేతలు ఆరోపించారు. తమ అధినేతపై దాడి చేస్తే... పోలీసులు కేసు పెట్టకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసన తెలపడం అంటే దాడి చేయడమా... అంటూ డీజీపీని ప్రశ్నించారు.

'చంద్రబాబు పర్యటన వైకాపాకు వణుకు పుట్టించింది'

వైకాపా నేతల తప్పుడు ప్రచారానికి బాబు పర్యటన తెరదించిందన్న నక్కా ఆనందబాబు

అమరావతిలో చంద్రబాబు పర్యటన... వైకాపాకు వణుకు పుట్టించిందని తెదేపా నేతలు పేర్కొన్నారు. అమరావతికి సంబంధించిన నిర్మాణాల వీడియోలను ప్రదర్శించారు. రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు లేవన్న అధికార పార్టీ నేతల తప్పుడు ప్రచారానికి... బాబు పర్యటన తెరదించిందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వమే దాడి జరిపించిందని... పోలీసులు వారికి వత్తాసు పలికారని ఆరోపించారు. రాళ్లు, చెప్పులతో దాడి చేయడం నిరసన తెలపడమా అని... డీజీపీని ప్రశ్నించారు.

మంత్రులు పేర్నినాని, కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించిన తెదేపా నేత కొల్లు రవీంద్ర

ఇద్దరు మంత్రులు లంబు... జంబులు...
కృష్ణా జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ... లంబు జంబుల్లా... జగన్ రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కొడాలి నాని సంతకం చేయడం నేర్చుకుని చంద్రబాబు గురించి మాట్లాడాలని విమర్శించారు. పేర్ని నాని పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి... బందరు పోర్ట్ గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే... ఊరుకోబోమని హెచ్చరించారు.

ఆర్థిక మంత్రికి కళ్లజోడు బహుమతిగా పంపించిన తెదేపా ఎమ్మెల్సీ

బుగ్గనకు కళ్లజోడు బహుమతి...
రాజధానిలో రూ.4,500 కోట్ల నిధులతో నిర్మాణాలు చేపడితే... ఆర్థిక మంత్రి బుగ్గనకు కనిపించడం లేదా.. అని తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ప్రశ్నించారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని చూడలేని బుగ్గనకు... తెదేపా తరఫున కళ్లజోడు పంపిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబును కడపలో కొట్టేవాళ్లం అన్న కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించిన ఆయన... మాజీముఖ్యమంత్రిని కొడతామని హెచ్చరిస్తే కేసులు నమోదు చేయరా... అని డీజీపీని ప్రశ్నించారు.

రాష్ట్రంలో రాక్షస పాలన ఉందన్న కాల్వ శ్రీనివాసులు

రాష్ట్రంలో రాక్షస పాలన...
రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. మాజీముఖ్యమంత్రికే రక్షణ కల్పించలేని స్థితిలో పోలీసు వ్యవస్థ ఉందని... ధ్వజమెత్తారు. చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన... జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కాన్వాయ్​పై జరిగిన దాడికి ఆరుగురు అదనపు డీజీలు సమాధానం చెప్పాలని... తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై కొందరు వైకాపా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

'చికిత్స' అనంతరం.. ఇకపై నెలకు రూ.5 వేలు ఆర్థికసాయం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.